కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం నుండి తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత తెలంగాణలో రోజు వారీ కేసులు 2 వేల మార్కును దాటాయి. జనవరి 2 నుండి నిన్నటి వరకు కేసుల సంఖ్య ఈ కింద తెలియజేస్తున్నాం.
జనవరి 2nd- 274
జనవరి 3rd- 482
జనవరి 4th- 1052
జనవరి 5th- 1520
జనవరి 6th- 1913
జనవరి 7th – 2295
జనవరి 8th- 2606
అయితే గత సంవత్సరం డిసెంబర్ వరకు అంతంత మాత్రంగానే ఉన్న కేసులు జనవరిలో భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ కేసులను బట్టి చూస్తే కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు విధించింది.
మరోవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలోనే దేశంలో, రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అయితే, నమోదయ్యే కేసుల్లో తీవ్ర ప్రభావం లేదని.. ఆస్పత్రుల్లో ఎక్కడ ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించామన్నారు..