పిల్లల్లో కరోనా టెన్షన్..కొత్త లక్షణాలివే..!

Corona tension in children .. new symptoms ..!

0
29

కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ తో పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్‌ బారిన పడుతున్నారు. మన వద్ద కూడా పిల్లల్లో కేసులు నమోదవుతున్నాయి.

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడంతోపాటు వాంతులు అవుతున్నాయి. జ్వరం, ఇతర సమస్యలు తక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు దీనిని అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. ప్రాథమిక వైద్యంతో కొందరిలో తగ్గిపోతోంది. మరికొందరు మాత్రం వైద్యులను సంప్రదిస్తున్నారు.

పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. డెల్టా వేరియంట్‌లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని, అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101-102 డిగ్రీల జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.