తెలంగాణలో కరోనా టెన్షన్..ఫోర్త్ వేవ్ రానుందా?

0
94

తెలంగాణలో మళ్లీ కరోనా టెన్షన్ నెలకొంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గగా మహమ్మారి పీడ విరగడైందని భావించారు. కానీ ఈ మహమ్మారి ఇప్పుడు చాపకింది నీరులా విస్తరిస్తుంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఇప్పుడు ప్రజలను కలవరపెడుతుంది.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 19 వేల 715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో  రాష్ట్రంలో 2వేల 026 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల మార్క్ దాటడం టెన్షన్ పెడుతోంది.

అయితే ఈ నెల ప్రారంభం నుండి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా 219 మార్క్ ను అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. ఈ నెల 16న 285 కొవిడ్ కేసులు, 17న 279 కేసులు, 18న 247 కేసులు నమోదయ్యాయి. దీనితో ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు.