కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా తెలియచేస్తున్నారు. ఇక తల్లిదండ్రులు ఇప్పటికే అసలు పిల్లలను బయటకు పంపించడం లేదు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత, బెడ్స్ లభించకపోవడం, వైద్య పరికాల లేకపోవడం, రెమ్డెసివిర్ కొరత, బ్లాక్ ఫంగస్లో ఉపయోగించే ఇంజక్షన్ల కొరత ఇలా చాలా సమస్యలు వచ్చాయి.
ఇక వైద్య ఆరోగ్యశాఖ, ఆస్పత్రులు అన్నీ కూడా థర్డ్ వేవ్ వస్తే ఎలాంటి సమస్య లేకుండా అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్ గురించి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా థర్డ్ వేవ్ ప్రజలు వ్యవహరించే తీరు, వ్యాక్సిన్ ఇవ్వడంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. అందరూ కరోనా నిబంధనలు పాటించి మాస్క్ ధరించి టీకాలు వేసుకుంటే థర్డ్ వేవ్ రాదని, అసలు అవకాశం ఉండదు అని తెలిపారు.
కేసులు పెరుగుతున్న చోట మరింత జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు. మొత్తానికి ఆయన చెప్పిన మాట విని అందరూ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే మాస్క్ పెట్టుకోవడం మాత్రం మరువద్దు, అంతేకాదు కచ్చితంగా టీకాలు ప్రతీ ఒక్కరు తీసుకోవాలి.