దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది.
ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో..12,751 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 42 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 3.50 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ నుంచి 16,412 మంది కోలుకున్నారు.
మొత్తం కేసులు: 4,41,74,650
మొత్తం మరణాలు: 5,26,772
యాక్టివ్ కేసులు: 1,31,807
కోలుకున్నవారి సంఖ్య: 4,35,16,071