ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది.
దేశంలో శనివారం 14,092 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. పాజిటివిటీ రేటు 4.36 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.26 శాతానికి పడిపోయాయి. భారత్లో శనివారం 28,01,457 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,07,99,63,555కు చేరింది.
క్రియాశీల కేసులు: 1,16,861
మొత్తం మరణాలు: 5,27,037
కోలుకున్నవారు:4,36,09,566