కరోనా అప్డేట్..132 మంది ప్రాణాలు తీసిన వైరస్..కొత్త కేసులు ఎన్నంటే?

Corona update..virus that killed 132 people..what are the new cases?

0
88

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 6,563 కేసులు నమోదు కాగా వైరస్​ ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,077 మంది కోలుకున్నారు. 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​ కేసులు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో టీకా పంపిణీ విస్తృతంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 15,82,079 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,37,67,20,359కు చేరింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 4,74,101 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3870 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం కేసులు: 3,47,46,838‬

మొత్తం మరణాలు: 4,77,554

యాక్టివ్ కేసులు: 82,267

కోలుకున్నవారు: 3,41,87,017