ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా- భారత్ బయోటెక్

Corona vaccine given through the nose

0
33

ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు కరోనా టీకాను త్వరలోనే భారత్ బయోటెక్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్లినికల్ పరీక్షలపై రెండున్నర నెలల్లో సమాచారం వెల్లడిస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది.

ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా తయారీకి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.  వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్ తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్న భారత్ బయోటెక్ .

ముక్కు ద్వారా ఇచ్చే టీకాను నెలకు పది కోట్ల డోసుల మేర ఉత్పత్తి చేయొచ్చన్నారు భారత్ బయోటెక్ సీఎండీ డా. ఎల్ల కృష్ణ . మొదటి డోసు కోవాగ్జిన్, రెండో డోసు ముక్కు ద్వారా ఇస్తే వచ్చే ఫలితాలపై నిర్ధారించే యత్నాల్లో భారత్ బయోటెక్ ఉందని కాంబినేషన్ టీకా ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి కోరినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.