ఏపీలో కరోనా విలయతాండవం..ఒక్కరోజే ఎన్ని పాజిటివ్ కేసులంటే?

Corona Vilayatandavam in AP..how many positive cases in one day?

0
131

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది.  తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,95, 136కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ విహెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో ఏడుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 549కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో  93305 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 4800 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి దాకా 3, 20, 56, 618 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  1610

చిత్తూరు         685

ఈస్ట్ గోదావరి   941

గుంటూరు  846

వైస్సార్ కడప  1492

కృష్ణ   484

కర్నూల్  1551

నెల్లూరు   1198

ప్రకాశం    1597

శ్రీకాకుళం 865

విశాఖపట్నం  1728

విజయనగరం 862

వెస్ట్ గోదావరి   643