కరోనా విలయతాండవం..అక్కడ మళ్లీ లాక్​డౌన్!

Corona Vilayatandavam..locked down again there!

0
137

రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నందన కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రాజధాని మాస్కోలోని పాఠశాలలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లతో పాటు..దుకాణాలన్నింటినీ అక్టోబర్ 28 నుంచి 11 రోజుల పాటు మూసివేయాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే దేశంలో నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు.

రష్యాలో తాజాగా 36,339 కొత్త కేసులు, 1,036 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఐరోపాలోనే అత్యధికంగా రష్యాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను 2,27,389కి చేరింది. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో తొలిస్థానాల్లో అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో ఉండగా రష్యా ఐదో స్థానంలో కొనసాగుతోంది.