మెదడు నియంత్రణ తగ్గిపోతుందా? గుర్తించే లక్షణాలు ఇవే!

0
123

మనందరికీ రెండు కళ్ళు ఉంటేనే మనం ఏదైనా స్పష్టంగా చూడగలం. కానీ కొందరికి  ఒక వైపు దానంతటదే కనురెప్ప వాలిపోవడం, ఒక వైపు భాగమంతా..అకస్మాత్తుగా జారిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒకవైపు కండరాలు మెదడు నియంత్రణ తగ్గిపోవడంతో జరుగుతోంటుంది. దీన్నే వాడుక భాషలో ‘ఫేషియల్‌ పెరాలసిస్‌’, వైద్య పరిభాషలో ‘బెల్స్‌పాల్సీ’ అంటారు. ఇది మనుషులలో చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదు.

మెదడు కింద ఉన్న వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అలా పుర్రె భాగం నుంచి బయటకు వచ్చిన నాడులను ‘క్రేనియల్‌ నర్వ్స్‌’ అంటారు. ఇందులో ముఖం కండరాలను నియంత్రించే ‘ఏడవ నరం’ దెబ్బతినడం వల్ల ముఖంలోని ఒకవైపు భాగమంతా చచ్చుబడినట్లు అవుుతంది.. ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎదుటివారికి స్పష్టంగా కనిపిస్తుంది.

లక్షణాలు

హెర్పిస్‌ సింప్లెక్స్‌ లాంటి ఏదైనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చాక, దాని వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్‌ ఫేషియల్‌ను దెబ్బతీసాయి. ఫలితంగా నరాలు వాస్తాయి. దాంతో అది నియంత్రించే భాగాలు చచ్చుబడిపోతాయి. ఫలితంగా మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తున్నప్పుడు ఒకవైపు నుంచి సరిగా చేయలేకపోవడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్సలో భాగంగా అవసరాన్ని బట్టి డాక్టర్‌ల సూచన మేరకు యాంటీ వైరల్‌ మందులు, స్టెరాయిడ్స్‌ వాడతారు. మెరుగుదల అన్నది జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. తొంభైశాతం పైగా బాధితులు ఆరునెలల్లో పూర్తిగా కోలుకుంటారు. అయితే ఇది కొందరిలో వంశపారపర్యంగా వస్తుందని అని కూడా అంటారు..ఇంకా ముడతలు వస్తున్నాయని చేసే ట్రీట్మెంట్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందట.