ప్రజలకు ఊరట..తగ్గిన కరోనా యాక్టివ్‌ కేసులు

Decreased corona active cases

0
32

గత కొన్ని రోజులుగా దేశంలో 20 వేలకు పైనే కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతటి క్రితం రోజు(22,842)తో పోల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200 లోపే చోటు చేసుకోవడం ఊరట కలిగిస్తోంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 కేసులు నమోదయ్యాయి. నిన్న 180 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,48,997కి చేరింది. ఇక కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కవగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న ఒక్క రోజే 26,718 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 3.31 కోట్లకు చేరింది.

రీకవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరి 2,64,458 (0.78%)గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 90.79 కోట్ల డోసులను కేంద్రం పంపిణీ చేసింది.