Diabetes Diet | మధుమేహం ఉందా.. ఈ ఆహారాలను మర్చిపోవాల్సిందే..!

-

Diabetes Diet | మధుమేహం ప్రపంచంలో అత్యధికంగా ఉన్న వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఇందులో అత్యధిక మధుమేహ గ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. 20-79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఈ మధుమేహ ప్రమాదం అధికంగా ఉంటున్నట్లు గుర్తించినట్లు వైద్యులు చెప్తున్నారు. అంతేకాకుండా చాలా మంది మధుమేహం బారిన పడిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియక.. షుగర్ ఊభిలో కూరుకుపోతున్నారని చెప్తున్నారు వైద్యులు. అత్యధికంగా ఆహారం విషయంలో అప్రమత్తత లేకపోవడం వల్లే చాలా మందికి మధుమేహం అతిపెద్ద సమస్యగా మారుతోందని నిపుణులు తమ అధ్యయంలో కనుగొన్నట్లు వెల్లడిస్తున్నారు. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే అది తగ్గదు. నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం. ఈ నియంత్రణలో మన ఆహారం ప్రధాని భూమిక పోషిస్తుందని నిపుణులు చెప్తున్న మాట. ప్రతి ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారానికి దూరంగా ఉండాలో తప్పకుండా తెలుసుకోవాలని, కొన్ని ఆహారాలు ఎంత మేలు చేస్తాయో మరికొన్ని అంతే చేటు చేస్తాయని కూడా వివరిస్తున్నారు నిపుణులు.

- Advertisement -

షుగర్ ఉన్న వారు రక్తంలో గ్రూకోజ్ స్థాయిలను, శరీరంలో ఇస్సులిన్‌ను పెంచే ఆహార పదార్థాలకు ఆమడ దూరం పాటించాలని, లేకపోతే ప్రమాదం, సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. కొన్ని ఆహారాలు, పానియాలు, మన రక్తంలోని గ్లూకోజ్, ఇస్సులిన్ స్థాయిలను సేవించడం మంచిదే అయినప్పటికీ అవి కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు విషయంతో సమానంగా పనిచేస్తాయని అంటున్నారు వైద్యులు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం, అలసత్వం పాటించినా ప్రమాదం తప్పదని అంటున్నారు వైద్యులు. ఇంతకీ షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఒకసారి చూసేద్దామా..

బేకరీ ఐటమ్స్: సాధారణంగానే కేకులు, కొన్ని రకాల బిస్కెట్లు వంటి వాటిని అధికంగా తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కానీ వీటిని షుగర్ ఉన్న వాళ్లు తింటే మాత్రం చిటికెడు కూడా తీవ్ర సమస్యలను తెచ్చిపెడతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం కోసం కేకులు, కుకీస్, వైట్ బ్రెడ్స్ వంటి బేకరీ పదార్థాలు పూర్తిగా మానుకోవాలి. ఇవి తింటే మన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇవి మన శరీరంలో చెడు కొవ్వును తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల వీటి స్థానంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు వివరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ కూడా మన ఆరోగ్యానికి మేలు చేయవని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి విష పానియాలుగా పనిచేస్తాయని అంటున్నారు నిపుణులు.

ఆల్కాహాల్: షుగర్ వ్యాధితో ఇబ్బంది పడే వారు ఆల్కాహాల్‌ను మానేయడమే శ్రేయస్కరం. మద్యం సేవించడం వల్ల మన లివర్ గ్లూకోజ్‌ను విడుదల చేసే సామర్థ్యం ప్రభావితమవుతోంది. అందువల్ల ఆల్కహాల్‌ను తీసుకోవడం మానేయడమే మంచిది. అంతేకాకుండా ఆల్కహాల్ వల్ల బరువు పెరిగే సమస్యలు కూడా పెరుగుతాయి. ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా మద్యం తొలి మెట్టులా మారుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్: వీటన్నింటితో పాటుగా షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రాసెస్డ్ ఫుడ్‌కు వీలైనంత దూరం పాటించాలి. వీటిలో అనారోగ్యకరమైన కొవ్వు, ఉప్పు స్థాయిలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల టైప్ 2 డయాబెటీస్ పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా ఉండటమే షుగర్ వ్యాధి ఉన్న వారికి మేలు చేకూరుస్తుంది. సమస్య ఉందని తెలిసిన వెంటనే వైద్యుల సలహా మేరకు ఆహార విషయంలో మార్పులు చేసుకోవాలి. అంతేకాకుండా మన లైఫ్‌స్టైల్‌ను కూడా హెల్తీగా మార్చుకోవాలి. వీటితో పాటుగా డ్రైడ్ ఫ్రూట్స్‌కు కూడా షుగర్ వ్యాధి ఉన్న వారు దూరం పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 Diabetes Diet | అయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు షుగర్ తక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలి. బ్రకోలి, క్యాబేజీ, యాపిల్స్, అవకాడోస్, బీట్‌రూట్స్, క్యారెట్స్ వంటి వాటిని తీసుకోవాలని వైద్యులు వివరిస్తున్నారు. షుగర్ వ్యాధి వచ్చిందని తెలిసిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాలని, లేనిపక్షంలో ఈ సమస్య పెరిగి పెద్ద ప్రమాదంలా అవతరిస్తుందని వివరిస్తున్నారు నిపుణులు.

Read Also: ఉప్పు ఎక్కువ తింటున్నారా.. ఈ క్యాన్సర్ రావొచ్చు.. జాగ్రత్త..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...