వరల్డ్ చాక్లెట్ డే ఎప్పుడో తెలుసా – ఎందుకు జరుపుకుంటారంటే ?

Did you ever know World Chocolate Day - why celebrate

0
95

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చాక్లెట్స్ ని ఇష్టపడతారు. అసలు ఈ కాండీలు అంటే ఇష్టం లేని వారు ఉండరు. ఏ వేడుక అయినా నోరు తీపి చేసుకోవడానికి ఈకాండీలు ఫారెన్ లో బాగా వాడతారు. మానసిక స్థితిని పెంచడానికి చాక్లెట్లు చక్కగా ఉపయోగపడతాయి. జూలై 7 న ప్రపంచ చాక్లెట్ రోజును జరుపుకుంటారనే విషయం మీకు తెలుసా. మరి ప్రపంచ వ్యాప్తంగా ఆరోజు చాక్లెట్ డే జరుపుకుంటారు.

ఓ సారి దీని చరిత్ర చూద్దాం.మొదటిసారి ప్రపంచ చాక్లెట్ డేను 2009 సంవత్సరంలో నిర్వహించారు. అయితే దీనికి ప్రత్యేకంగా కారణం తెలియదు కానీ, 16 వ శతాబ్దంలో మొదటిసారిగా చాక్లెట్ను యూరప్ కు తీసుకువచ్చినట్లు చెబుతారు. 7 జూలై 1550 మొదటిసారి ఖండానికి చాక్లెట్ తెచ్చిన రోజుగా చెబుతారు. అందుకే ఈరోజు చాక్లెట్ డే జరుపుకుంటారు.

చాకెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కూడా, అయితే అది మితంగా తీసుకోవాలి. చాక్లెట్ మన మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయిలను పెంచి మనసులోని ఆందోళనలను తగ్గించడంలో సహకరిస్తుంది. అంతేకాదు ఇది అతిగా తీసుకుంటే శరీరం బరువు పెరుగుతుంది . మితంగా వారానికి ఓసారి డార్క్ చాక్లెట్ తీసుకోండి.