మీ ఇంటిలో ఈ క్లాత్స్ ఎన్ని రోజులకి వాష్ చేయాలి తప్పక తెలుసుకోండి –రోగాలు రావు

మీ ఇంటిలో ఈ క్లాత్స్ ఎన్ని రోజులకి వాష్ చేయాలి తప్పక తెలుసుకోండి --రోగాలు రావు

0
96

చాలా మంది ఇంటిలో కర్టెన్లు వాల్ కర్టెన్లు కిచెన్ క్లాత్స్ విషయంలో చాలా అశ్రద్ద వహిస్తారు, ఆ ఇళ్లల్లో ఎవరో ఒకరికి అలర్జీ లేదా ఫీవర్ జలుబు వస్తుంది అప్పుడు దానిపై ఆలోచిస్తారు, అయితే వారు తినే ఆహారంతో పాటు మీ ఇంటి పరిశుభ్రత కూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఏ క్లాత్స్ ఎన్ని రోజులకి వాష్ చేయాలి, అలాగే ఎన్ని రోజులకి వాడాలి అనేది చూద్దాం.

ముందుగా కర్చీఫ్స్ – కచ్చితంగా రోజుకి ఒకటి మాత్రమే వాడాలి.. రెండు రోజులకి ఓసారి మార్చద్దు, రోజూ కర్చీఫ్ ఒకటి వాడండి, ఇవి వేడీ నీటిలో సర్ఫ్్ వేసి ఉతకాలి.

ఇక టవల్స్ , విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. మూడు రోజులకి ఓసారి టవల్ వాష్ చేయాలి, అలాగే బాడీ తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కింద కాదు కచ్చితంగా ఎండలో వేయాలి, ఏదైనా బ్యాక్టిరీయా ఉన్నా నశిస్తుంది.

డోర్ కర్టెన్స్ కచ్చితంగా 10 రోజులకి ఓసారి బెడ్ రూమ్ వి మార్చాలి, ఓపెన్ డోర్ వీధి గుమ్మం కర్టెన్ అయితే వారానికి మార్చాలి.

కిచన్ క్లాత్ రోజుకి ఒకటి మార్చాలి అవి వేడి వాటర్ లో ఉతకాలి.

ఫ్రిజ్ కవర్ వాషింగ్ మిషన్ కవర్ వారానికి ఓసారి మార్చాలి.

బెడ్ షీట్లు కూడా మూడు రోజులకి ఒకటి మార్చాలి…ఇలా మార్చకపోతే వారి తలలో చుండ్రు ఎక్కువగా రావడానికి కారణం ఇవే అంటున్నారు నిపుణులు.