భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
42

నేడు పుత్త‌డి ధ‌ర త‌గ్గింది. బంగారం ధ‌ర మ‌ళ్లీ మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది, బంగారం ధ‌ర గ‌డిచిన వారం రోజులుగా త‌గ్గుతూనే వ‌స్తోంది, నేడు కూడా మార్కెట్లో త‌గ్గింది బంగారం ధ‌ర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పడిపోయింది. దీంతో ధర రూ.53,430కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.270 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,980కు చేరింది

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.580 దిగొచ్చింది. దీంతో ధర రూ.67,980కు పడిపోయింది. ఇంకా వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్ల‌లో పెట్టుబ‌డులు మ‌ధుప‌రులు పెట్ట‌డంతో భారీగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది, వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంటుంది అని అంటున్నారు అన‌లిస్టులు.