భోజ‌నం చేసిన త‌ర్వాత ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి

Do not do these things at all after a meal

0
135

చాలా మంది రాత్రి భోజ‌నం చేశాక వెంట‌నే ప‌డుకుంటారు. కాని నిద్ర‌కి భోజ‌నానికి రెండు గంట‌ల గ్యాప్ ఉండాలి. ఇక మ‌ధ్యాహ్నం కూడా భోజ‌నం అయ్యాక చాలా మంది కునుకు తీస్తారు. ఇది చాలా ప్ర‌మాదం. గుండె జ‌బ్బులు, ఊబ‌కాయ స‌మ‌స్య‌లు వ‌స్తాయి అంటున్నారు నిపుణులు. మ‌ధ్నాహ్నం భోజనం చేశాక పొట్ట నిండుగా అనిపిస్తుంది. అప్పుడు మీరు శ‌రీరం తేలిక చేసుకోవడానికి ఒక పది నిమిషాలు వాకింగ్ చేయొచ్చు.

భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. తిన్న త‌ర్వాత మ‌ధ్నాహ్నం అరగంట సేపు నడవడం వల్ల గుండె జబ్బుల నుంచి 20 శాతం రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక చాలా మంది అన్నం తిన్న త‌ర్వాత ఎక్స‌ర్ సైజులు చేస్తారు ఇది చాలా త‌ప్పు.

ఇక ర‌న్నింగ్ చేస్తారు ఇది త‌ప్పు. కేవ‌లం వాకింగ్ మాత్ర‌మే చేయాలి. ఇక ఈ మ‌ధ్య కొంద‌రు హెవీ ఫుడ్ తీసుకుని జిమ్ చేస్తున్నారు ఇది కూడా ఆరోగ్యానికి చేటు. అన్నం తిన్న త‌ర్వాత నెమ్మ‌దిగా 10 నుంచి 12 నిమిషాలు న‌డ‌వ‌డం వ‌ల్ల మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారం అరుగుద‌ల అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. భోజనం చేసిన తర్వాత మీరు కూర్చున్నా లేదా పడుకున్నా మీకు అసిడిటీ గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.