ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగచ్చా తాగకూడదా ?

Do not drink lemon water on an empty stomach ?

0
102

చాలా మంది ఉదయమే నిమ్మకాయ రసం తాగుతారు. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని ఖాళీ కడుపుతో తాగుతారు. అయితే ఇది మంచిదేనా దీని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని కొందరికి అనుమానం ఉంటుంది. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఈ సిట్రిస్ పండ్లని తీసుకుంటారు.

నిమ్మలోని విటమిన్ సీ, ఇ, బీ6, థియామిన్, నియాసిన్, రిబోప్లేవిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి. ఎవరికైనా జీర్ణ సమస్యలు ఉంటే ఈ నిమ్మకాయ చక్కని ఔషదం అనే చెప్పాలి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిస్తుంది. బాడీలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం తక్కువ.

ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తీసుకోవడం వలన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు. ఊబకాయ సమస్య తగ్గుతుంది. కొవ్వు కరగడం జరుగుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయానికి కూడా ఇది మంచిది.