క్యాబేజీని పచ్చిగా అస్సలు తినవద్దు – క్యాబేజీ గురించి కచ్చితంగా ఇది తెలుసుకోండి

Do not eat cabbage raw at all

0
33

ప్రతీకూరగాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక వీటి ద్వారా ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. కొందరు కొన్ని రకాల కూరగాయలు తీసుకోరు, వాటిని తినమంటే మాకు ఇష్టం లేదు అంటారు. అయితే శరీరానికి అన్ని పోషకాలు అందాలంటే కచ్చితంగా అన్నీ రకాల కూరగాయలు తినాల్సిందే. అయితే కొందరు క్యాబేజీ మాత్రం తీసుకోరు ఈ వాసన కూడా కొంత మందికి పడదు.

క్యాబేజీ తీసుకోవచ్చు కాని దీనిని బాగా శుభ్రం చేసుకుని మాత్రమే వాడాలి. ముఖ్యంగా ఈ రెయినీ సీజన్లో కొందరు క్యాబేజీ తీసుకోరు ఎందుకు అంటే ఈ ఆకులపై ఒక రకమైన పురుగు ఉంటుంది. ఆ పురుగు భయంతోనే చాలా మంది క్యాబేజీ కొనేందుకూ, తినేందుకూ భయపడుతున్నారు. ఎందుకంటే ఆ పురుగు క్యాబేజీ తిన్న వారి మెదడులోకి చేరుతోంది.

క్యాబేజీ, కాలిఫ్లవర్ఇవి రెండూ ఒకే రకమైన జాతి మొక్కల నుంచి వస్తాయి.క్యాబేజీ ఆకులపై టేప్వార్మ్ అనే పురుగు ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి పచ్చిగా అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఆ పురుగు మన నోటి ద్వారా పొట్టలోకి వెళ్తుంది. అక్కడి పేగుల్లోకి వెళ్లి మెల్లగా రక్తంలోకి చేరుతుంది.

రక్తంలా ఈదుకుంటూ వెళ్లిమన మెదడులోకి వెళుతుంది. ఇవి క్యాబేజీ ఆకులపై ఉండి వాటిని తింటుంది. అందుకే కచ్చితంగా ఈ కూర ఎప్పుడు వండుకున్నా వేడి నీటిలో ఈ ఆకులు కడిగి అప్పుడు మాత్రమే వండుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.