టమాటో తో పాటు రాత్రి పూట ఈ ఆహారం తీసుకోవద్దు

Do not take this food at night along with tomatoes

0
140

టమాటో చూడగానే తినాలనిపిస్తుంది. పచ్చడి, కూర, పులుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత టమాటోకే కిరీటం పెట్టాలి అంతలా దీనిని మనం ఇష్టంగా తింటాం. ఇక పండిన
టమాటో లు తినేవారు కూడా ఉంటారు. అయితే దాని రుచి అలాంటిది. శరీరానికి అనేక పోషకాలు అందిస్తుంది. టమాటోలో విటమిన్ ఎ విటమిన్ సి విటమిన్ కె విటమిన్ బి కాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,సోడియం,జింక్ ఫైబర్,ప్రోటీన్,యాంటీ ఆక్సిడెంట్స్ చెప్పుకుంటూ పోతే చాలా పోషకాలు ఉన్నాయి.

ముఖ్యంగా నిపుణులు కూడా టమాటో తీసుకోవచ్చు అని చెబుతారు.అయితే చాలా మంది రాత్రి పూట
టమాటోతో చేసిన పులుసు రసం పచ్చడి తింటారు. సో ఇలాంటి అలవాటు ఉంటే బంద్ చేయండి. రాత్రిపూట టమాటో తినడం శ్రేయస్కరం కాదు.టమాటోలో ఉండే టైరమైన్ అనే అమైనో ఆమ్లం గ్యాస్ ఎసిడిటీ గుండెల్లో మంట సమస్యలకు కారణం అవుతుంది. అందుకే సరిగ్గా నిద్రరాక ఆందోళన సమస్యలు ఉంటాయి.

ముఖ్యంగా హై బీపీ షుగర్ ఉన్నవారు, గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు ఇలా రాత్రి పూట
టమాటోని అస‌లు తీసుకోవద్దు. అలాగే దోసకాయ, కీరదోస కూడా రాత్రి తీసుకోవద్దు. ఇక రాత్రి పూట దుంప కూరలు కూడా తీసుకోకపోవడం మంచిది.