ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..

0
129

రైతులు ఉల్లిపై అధిక లాభం రావడంతో ఉల్లిని పండించడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. కానీ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలంటే పంట కోత కోసిన వెంటనే అమ్మకూడదు. కొన్ని రోజులపాటు నిల్వ ఉంచి అప్పుడు అమ్ముకుంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మనం నిల్వ ఉంచిన సగానికి సగం పాడయిపోతాయి. కానీ అల జరగకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

ఉల్లిపాయలను నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచడం. కాబట్టి తేమ తక్కువగా ఉండే చిన్నగది లేదా స్టోర్ రూమ్‌లలో ఉంచడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఒకవేళ పొట్టు తీసిన ఉల్లిపాయలయితే వాతావరణ పరిస్థితిని బట్టి రెండు మూడు నెలల నిలువ ఉంటాయి.

అధిక మొత్తంలో ఉల్లిని నిల్వ చేయాలంటే ఈ పద్ధతి పాటిస్తే మంచి లాభాల బాట పట్టొచ్చు. ఉల్లిని కోసిన తర్వాత గోను సంచుల్లో నిల్వ చేయకుండా ఉల్లి కోత తర్వాత కాడలతో సహా దానిని తీసుకువెళ్లి వేలాడ తీస్తున్నారు. ఇలా చేయడం వల్ల గాలి తగిలి ఉల్లిగడ్డలు కుళ్ళి పోకుండా ఉంటాయి. ఇలా చేస్తే మూడు నుండి నాలుగు నెలల పాటు ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా నిల్వ ఉంటాయి.