వేసవిలో చెరకు రసం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా?

0
44

కాలాలకు అతీతంగా దొరికే సహజ సిద్ద తీయని పానీయం చెరకురసం. ఈ చెరకు రసాన్ని ఇష్టపడని వారుండరు. చెరకు రసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజు ఒక గ్లాస్ చెరకురసం తాగితే కలిగే ప్రయోజనాలివే..

జలుబు ,దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాస్ చెరకు రసం తాగడం వల్ల ఈ జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వేసవిలో ప్రతి రోజు ఒక గ్లాస్ చెరకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలో నీటి శాతం పంచేందుకు కూడా ఈ చెరకు రసం ఉపయోగపడుతుంది.  శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ ను ఈ చెరకు రసం తగ్గించగలదు.

ఇందులో క్రోమియం,మెగ్నీషియం, జింక్,ఐరన్, వంటి ఖనిజాలు  అధికంగా ఉంటాయి. అందుకే ఇది బాలింతలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఈ చెరకు రసం తరచు వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి కావలసిన పోషకపదార్దాలన్నీ చెరకు రసంలో లభిస్తాయి.