వేసవిలో మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి..

0
79

స్త్రీలు అందంగా ఉండడానికి ఎల్లప్పుడూ వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ ఆశించినా మేరకు ఫలితాలు రాకపోవడంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ చిట్కా పాటిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా అద్భుతమైన లాభాలు పొందొచ్చు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..

టొమాటోలు ఆరోగ్యానికి ఎంత మేలో చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ టొమాటోలు కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యాన్ని పెంచడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. టొమాటో రసాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందొచ్చు. చర్మంపై టొమాటో రసం, మెత్తని టమోటాలు అప్లై చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.

ముఖ్యంగా మొటిమలతో బాధపడేవాడు టొమాటో రసాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. రోజు టొమాటో రసాన్ని రసాన్ని అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోయి వృద్ధాప్యఛాయలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు కూడా తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.