కంటి ఆరోగ్యం ఎల్లప్పుడు బాగుండాలంటే ఇలా చేయండి..

0
133

మనిషికి కళ్ళు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తూ చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే కంటి ఆరోగ్యం ఎల్లప్పుడు బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీరు కుడా ఓ లుక్కేయండి..

విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. కావున విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహారపదార్దాలను తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు..కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ బాడీ లో విటమిన్ ఏ లోపిస్తే కళ్లు కనిపించకపోవడం, రేచీకటి, డ్రై ఐ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే పసుపురంగులో ఉండే పండ్లనుతీసుకోవడం మంచిది. ఎందుకంటే వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కావున పసుపురంగు పండ్లను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం మంచిది. ఇంకా  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారపదార్దాలు తీసుకోవడం మంచిది. అంటే, చేప, గింజలు, సాల్మన్ వంటి పదార్దాలు తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉన్న ఆహారపదార్దాలను తీసుకోవడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి.