పెదవులు మృదువుగా మారాలంటే ఇలా చేయండి..

0
93

కొందరు ఎన్ని లిప్‌స్టిక్‌లు పూసుకున్న పెదవులు అందవిహీనంగానే కనిపిస్తాయి. ఇంకొందరు ఎన్ని క్రీమ్ లు రాసిన పెదవులు పలుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పటి నుండి ఇంట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మెరిసే పెదాలను మీ సొంతం చేసుకోవచ్చు.

రోజు రాత్రి పడుకునే ముందు తేనె రాసి మెత్తని బ్రష్ తో మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. పెదవులు మరింత అందంగా కనిపించాలంటే కొత్తిమీర, పుదీనా క్యారెట్ జ్యూసులు తాగుతూ ఉండాలి.

కొందరు పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడుతుంటారు. కానీ మీరు నిరాశచెందకుండా..బీట్ రూట్ రసాన్ని ఉదయాన్నే పేదలకు రాసుకుంటే పెదాలు మృదువుగా తయారవుతాయి. ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే పెదాలపై ఉన్న నలుపు రంగు తొలగిపోతుంది. ఈ ప్రయత్నం వల్ల పెదాల పగుళ్ల సమస్య నుంచి బయట పడొచ్చు. అంతేకాకుండా ఆకుకూరలు తినడం వల్ల కూడా చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. పెదాలు కూడా పగలకుండా ఉంటాయి.