తక్కువగా నిద్రపోతున్నారా? అయితే మీకు ఈ వ్యాధి వచ్చినట్టే..

0
44
Shot of an attractive young woman asleep in her bedhttp://195.154.178.81/DATA/i_collage/pi/shoots/783514.jpg

మారుతున్న జీవన విధానంతో పనుల హడావిడిలో పడి చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేరు. మన శరీరం ఎంత కష్టపడినా కానీ, మెదడుకు విశ్రాంతిని ఇచ్చే నిద్రను మాత్రం మానకూడదు. నిద్రపోకపోవడం అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా నిద్రలేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యనాల్లో వెల్లడయ్యింది.

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అధికంగా పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది టైప్ 2 డయాబెటిస్ వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజుకు కనీసం 8గంటల సమయం నిద్రపోవడానికి కేటాయించాలి.

అంతేకాకుండా నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్​కు గురయ్యే ప్రమాదం దాదాపు 4 రెట్లు అధికం అవుతుంది. శరీరంలో ఎంతో సున్నితంగా ఉండే మెదడుపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. రాత్రివేళలో మెదడు విశ్రాంతి తీసుకొని..మెదడులో ఉండే వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. అందుకే రాత్రి సమయంలో చక్కగా నిద్రపోండి.