బీర్ అధికంగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ..

0
107

ప్రస్తుత కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు అధికంగా పెరుగుతుంది. దీనిని తాగడం వల్ల ఆరోగ్య పరంగా చాలా నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుందని తెలిసిన కూడా సమాజంలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఒక్కసారి ఈ విషయాన్నీ తెలుసుకుంటే మళ్ళి జీవితంలో మద్యం తాగడానికి జోలికి పోరు. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

మద్యాన్ని అధికంగా తాగడం వల్ల కాలేయం మీద చాలా ప్రభావం పడి..కాలేయం పరిమాణం తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక కొవ్వు, డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఆల్కహాలుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చల్లని బీర్ తాగడం వల్ల శరీరంలో వేడి చేయడం వల్ల చాలా సమయాలు తలెత్తే అవకాశం ఉంది.

అందుకే వీటికి బదులుగా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగలాంటి పానీయాలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. బీర్ల‌ను అధికంగా తాగ‌డం వ‌ల్ల అందులో ఉండే గ్యాస్ క‌డుపులో అసిడిటీని కలిగించడం వల్ల క‌డుపులో మంట, జీర్ణాశ‌యం, పేగుల్లో అల‌జడి మొద‌లై అల్స‌ర్ల‌కు దారి తీస్తుంది. ఇంకా కొంతమందికి క‌డుపులో పుండ్లుకూడా ఏర్పడానికి అవకాశం ఉంటుంది.