నిద్ర లేవగానే ఛాయ్ తాగుతున్నారా? అయితే మీరు స్లో పాయిజన్ తాగుతున్నట్లే..

Do you drink chai when you wake up? But it's like you're drinking slow poison.

0
86

చాలామందికి తమ రోజును ఒక కప్పు ‘చాయ్’తో మొదలు పెడుతుంటారు. అదే పెద్ద అలావాటుగా మార్చుకుంటారు. అందులోనూ పొగలుకక్కే చాయ్‌ తాగడానికి భలే ఇష్ట పడుతుంటారు. ఇది మలబద్దకానికి కూడా కారణంగా మారుతుందని..ఇలా తాగడం వల్ల ప్రేగులపై ప్రభావం చూపుతుందని ఓ నివేదిక హెచ్చరిస్తుంది.

క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయని అంటున్నారు. చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీలో 20 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కాదు.  ఇలా మీరు క్రమం తప్పకుండా టీ తాగుతున్నట్లైతే ఈ కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకోండి.

మీరు ఏదైనా వ్యాధికి ఔషధం తీసుకుంటున్నట్లైతే టీ తాగడం వెంటనే మానుకోండి.  క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి, రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్తపోటు పెరుగుతుంది. అసిడోసిస్ పెరుగుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే నిరంతరం టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి.

ఎక్కువగా తయారు చేసిన టీని తాగడం వల్ల టీలో నికోటినామైడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నిల్వ ఉంచిన టీని మళ్లీ వేడి చేసి వాడకూడదు. ఇది స్లో పాయిజనింగ్ కంటే తక్కువేమి కాదు. వీలైనంత వరకు తాజా టీ మాత్రమే తాగండి. ఎక్కువ పాలతో టీకి బదులుగా గ్రీన్ టీని ఉపయోగించవచ్చు.