రాత్రి పూట అరటిపండు తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
42

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. మన ఆరోగ్యం బాగుండడం కోసం మనకు ఇష్టంలేని పదార్దాలు కూడా మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మనం తెలియక చేసే తప్పుల వల్ల కూడా చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో అరటిపండు తింటే లేని సమస్యలను కొని తెచుకున్నట్టే అంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా చూడండి..

కేవలం రాత్రి సమయంలో కాకుండా ఇతర సమయాలలో అరటిపండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది.కానీ రాత్రి పూట అరటిపండ్లు తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే దగ్గు, జలుబు ఉన్నవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అంతేకాకుండా రాత్రి సమయంలో అరటి పండ్లు తింటే అరగకపోవచ్చు. దానివల్ల వల్ల పొట్టలో బరువు ఉన్న ఫీలింగ్ కలిగి రాత్రి నిద్రపట్టకపోవడానికి కారణం అవుతుంది. ఇంకా జీర్ణ ప్రక్రియ కూడా సరిగా జరగదు. ఒకవేళ తినాలనిపించిన కూడా తిన్న తర్వాత కనీసం మూడు గంటలు మేల్కొని ఉండడం వల్ల అరిగే అవకాశం ఉంటుంది.