రోజు ఇంతకీ మించి గుడ్లు తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
95

చాలామంది ఇష్టపడని ఆహారాలలో గుడ్డు కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. మరికొంతమంది కనీసం దీని వాసన కూడా పీల్చడానికి ఇష్టపడరు. కానీ రోజు గుడ్డు పరిమిత స్థాయిలో తీసుకోవడం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే రోజు గుడ్డు పరిమితస్థాయిని మించి తీసుకుంటే రెట్టింపు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?

సాధారణ పరిస్థితుల్లో రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచింది. బాడీ బిల్డింగ్ కోసం రోజుకు కనీసం నాలుగు వరకు తింటే శరీరానికి ఎలాంటి హాని చేకూరే అవకాశం ఉండదు. కానీ అంతకు మించి తినడం ఎంత మాత్రమూ మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ,  గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

అంతేకాకుండా గుడ్డులో ప్రొటీన్స్ , విటమిన్ ఏ, బీ12, డీ, ఈ, పుష్కలంగా ఉండడం వల్ల రోజుకు రెండు గుడ్లు తినడం మేలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల కండరాలు బలంగా తయారయ్యి ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.