సాధారణంగా చాలామంది టమాటాలు తినడానికి ఇష్టపడతారు. దీని రుచి బాగుంటుంది అని అనేక రకాల వంటల్లో కూడా దీనికి కలిపి వండుతుంటారు. అంతేకాకుండా కొంతమంది పచ్చి టమాటాను కూడా తింటూ ఉంటారు. కానీ దీనిని అధికంగా తినడం అంటే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే అంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..
టమాటాలు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్, హైబీపీ సమస్యలతో బాధపడేవారు కూడా వీటికి దూరంగా ఉండడం మంచిది.
ఎందుకంటే వీరిలో కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టమాటాలను అధికంగా తీసుకోవడం గ్యాస్టిక్ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మధుమేహ సమస్య ఉన్నవారు అధికంగా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ మరింతగా క్షీణించేలా చేస్తుంది. అందుకేన ఎవ్వరైనా స్వల్పమోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.