సాధారణంగా మనం రోజుకు మూడు పూటలా భోజనం చేస్తుంటాం. కానీ ఈ ఉరుకుపరుగుల జీవితంలో తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అందుకే చాలా మంది భోజనాన్ని వేగంగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు కూడా ఈ అలవాటు ఉండే అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉందంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు భోజనాన్ని వేగంగా తినకపోవడం మంచిది. ఎందుకంటే భోజనాన్ని వేగంగా తినడం వల్ల అధికంగా ఆహారం తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో అధిక ఆహారం కొవ్వుగా మారి బరువును పెంచుతుంది. భోజనాన్ని వేగంగా చేసేవారికి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆహారాన్ని వేగంగా తింటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం సమస్యలు వస్తాయి. దీంతోపాటు దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అప్పుడు ఎన్ని మందులను వాడినా ఫలితం ఉండదు. కనుక భోజనాన్ని నెమ్మదిగా తినాలి.