గోళ్లు కొరకడం అనేది సాధారణంగా చేస్తుంటాం. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవారి వరకు అందరు గొర్లు కొరుకుతుంటారు. సాధారణంగా ఏమీ తోచనప్పుడు ఆటోమేటిక్ గా గోర్లు కోరికేస్తూంటాం.. గోళ్లు కొరకడం అనేది కొన్నిసార్లు ఆందోళన లేదా ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. గోళ్లు కొరకడం చెడ్డ అలవాటే కాదు ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. అదే అలవాటుగా మారితే ముప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చిన్నపిల్లలు పదే పదే గోర్లు కోరుకుతుంటే వద్దని మనం నివారించడానికి ప్రయత్నిస్తాం. కానీ అస్సలు కంట్రోల్ చేయలేము. ఈ గోర్లు కొరికే అలవాటును వైద్య భాషలో ఒనికోఫాగియా అంటారు. మనకు ఎక్కువగా ఒత్తిడి,ఆందోళన గురైనప్పుడు ఆటోమేటిక్ గా గోర్లు కోరికేస్తూంటాం. కానీ ఈ అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.
అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఇది ఒక మానసిక వ్యాధిగా గుర్తించారు. గోర్లు కొరకడం నమలడం వలన మానసిక ఆందోళన, మానసిక సమస్యలకు దారితీస్తుంది. విచారణకు లోనయ్యి సామాజికంగా బలహీనతలకు లోనవుతారు. గోళ్లు కొరకడం వలన ఇన్ఫెక్షన్స్, దంత , ఉదర సమస్యల బారిన పడతారు.
గోర్లు కొరికే అలవాటుకు చాలా కారణాలు ఉంటాయి. ఇందులో జన్యుపరమైన అంశాలు కూడా ఉండవు. మానసిక ఆందోళన.. ఒత్తిడి ఉన్నప్పుడు గోర్లు కొరుకుతుంటారు. అయితే గోర్లు కొరకడం.. నమలడం వలన ఒత్తిడి.. టెన్షన్.. నీరసం తగ్గుతుందని తెలీంది. సాధారణంగా కొందరు వ్యక్తులు.. ఒంటరిగా ఉన్నప్పుడు.. ఆకలిగా అనిపించినప్పుడు కూడా గోర్లు కొరుకుతుంటారు.