ఇన్ స్టాగ్రామ్ సంచలన నిర్ణయం..రెండు సర్వీసులు క్లోజ్..కారణం ఇదే!

0
40

ఇన్ స్టాగ్రామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరో రెండు సర్వీసులు అయిన వీడియో అప్లికేషన్లు బూమరాంగ్‌, హైపర్‌ లాప్స్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రధాన అప్లికేషన్‌లోనే వీడియో యాప్‌ల్లో ఉన్న అన్నీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో అప్లికేషన్లు బూమరాంగ్‌, హైపర్‌ లాప్స్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ మూడింటినీ ప్లే స్టోర్ల నుంచి ఏకకాలంలో తొలగిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రధాన అప్లికేషన్‌లోనే వీడియో యాప్‌ల్లో ఉన్న అన్నీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. యాప్‌లో ఈ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు సర్వీసులను మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.

బూమారాంగ్‌ యాప్‌ సర్వీస్‌ను మూసివేసే ముందు రోజే 26వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఓ నివేదిక పేర్కొంది. దీనితో ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో అప్లికేషన్‌ బూమరాంగ్‌ను 301 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకోగా.. హైపర్‌ లాప్స్ యాప్‌ను 23 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కాగా, మినీ వీడియోలు సృష్టించడానికి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా బూమారాంగ్‌ యాప్‌ను తీసుకురాగా.. సినిమాటోగ్రాఫిక్ ఎఫెక్ట్‌ని సృష్టించడానికి హైపర్‌లాప్స్‌ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చింది.