ప్రస్తుతకాలంలో చిన్నపెద్ద అని తేడా లేకుండా అందరు టీవీలకు, సెల్ ఫోన్ లకు బానిసై వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఉదయాన్నే టివి ముందు కూర్చుంటే మళ్ళి సాయంత్రం వరకు కనీసం టీవీ ముందు నుంచి కదలనుకూడా కదలరు. ఇంకొందరు కనీసం అన్నం తినేటప్పుడు కూడా విరామం ఇవ్వకుండా చూస్తూనే ఉంటారు. కానీ అలాంటి వారికీ ఈ ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..
ప్రతి రోజు నాలుగు గంటలకు మించి టీవీ చూడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎదుకంటే అధికంగా టీవీ చూడడం వల్ల గుండే సంబధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. దాంతోపాటు ప్రతి రోజు నాలుగు గంటలకు మించి టీవీ చూస్తే శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశాలు 35 శాతం పెరిగి అవకాశం కూడా ఉంటుంది.
ముఖ్యంగా కాళ్లలోని సిరల్లో రక్తం గడ్టకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అది ఊపిరితిత్తుల వరకు చేరి హానికరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే టివి చూసేటప్పుడు దూరంగా కూర్చొని చూడడంతో పాటు..మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా టీవీ చూస్తున్నప్పుడు జంక్ ఫుడ్, ఇతర ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎట్టి పరిస్థులలో తీసుకోకూడదు.