ఏ సమయంలో పండ్లు తింటే మంచిదో తెలుసా?

0
41

పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మనకు ఏ చిన్న సమస్య వచ్చిన పండ్లు తీసుకోమని వైద్యులు సూచిస్తారు. ఎందుకంటే వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా వేసవిలో పండ్ల రసాలు తాగడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి. కానీ కొన్ని సమయాలలో పండ్లు తీసుకోకూడదని మీకు తెలుసా? మరి ఎలాంటి సమయాలలో పండ్లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

పండ్లను ఎప్పుడు తినాలి: పండ్లను అల్పాహారంగా, భోజనంతో పాటు, భోజనంగా ఇలా రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి భోజనం ఒక పండుతో ప్రారంభించాలి.

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ను కొంచెం త‌గ్గించి అందుకు బ‌దులుగా పండ్ల‌ను తిన‌వ‌చ్చు. దీంతో రోజంగా ఉత్సాహంగా ఉంటారు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల్లో చాలా వ‌ర‌కు ఉద‌యాన్నే ల‌భిస్తాయి. దీంతో శ‌రీరం ఉత్తేజంగా ఉంటుంది. అల‌స‌ట త‌గ్గుతుంది. శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. దీని వ‌ల్ల ఉద‌యం ఉండే బ‌ద్దకం కూడాతొలగిపోతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మ‌ధ్య కూడా పండ్ల‌ను తిన‌వ‌చ్చు. ఆ స‌మ‌యంలో సిట్ర‌స్ పండ్ల‌ను తింటే మంచిది. సాయంత్రం స‌మ‌యంలో కొవ్వు ప‌దార్థాలు, జంక్ ఫుడ్స్‌ను తినేకంటే పండ్ల‌ను స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచిది. ఇక రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ పండ్ల‌ను తిన‌రాదు. కాబ‌ట్టి రాత్రి పూట త‌ప్ప పైన తెలిపిన ఏ స‌మ‌యంలో అయినా పండ్ల‌నుత తీసుకోవ‌చ్చు.