భారతీయ హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఎంత విశిష్టస్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన భారతీయులు పూజా కార్యక్రమాలకు, శుభకారార్యాలకు కొబ్బరికాయని వాడతారు. అంతేకాదు ప్రతీ ఆలయంలో నిత్యం టెంకాయలు కొడతారు. ఈ టెంకాయ పూజలకే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. చాలా సమస్యలు దూరం చేస్తుంది. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి.
విటమిన్ ఎ, బి, సి, రైబోఫ్లెవిన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పిండిపదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు ఈ కొబ్బరికాయలో ఉంటాయి. కొబ్బరి నీరు ఎంతో శక్తిని ఇస్తుంది. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండటానికి కొబ్బరి జలం ఉపయోగపడుతుంది. ఇక కొబ్బరి నూనె ప్రపంచం అంతా వాడతారు. అనేక సమస్యలు తగ్గుతాయి. ఇక జుట్టుకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి పాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
కొబ్బరిలోని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. కొబ్బరిని అందం కోసం ఉపయోగిస్తారు. కొబ్బరి నీరు తాగడం వల్ల కడుపులో సమస్యలు తగ్గుతాయి. కొన్ని లక్షల మంది ఈ కొబ్బరి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.