పోపుల పెట్టెలో ఈ మసాలా దినుసులు ఎంత మేలు చేస్తాయో తెలుసా

Do you know how good spices are?

0
215

మన వంటి ఇంటిలో ఉండే పోపుల పెట్టె ఔషధాల గని అనేది తెలిసిందే. గతంలో మన పెద్దలు ఏదైనా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వ‌స్తే ఈ పోపుల పెట్టెలో మసాలా దినుసులతో తగ్గించుకునేవారు. కాని నేడు మనం మందులు వేసుకుంటున్నాం. అయితే కొందరు ఈ పోపుల పెట్టెలో మసాలా దినుసులు అస్సలు వాడరు. కాని ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ముఖ్యంగా వెల్లుల్లి గురించి చెప్పాలి ఇది మనం నిత్యం తింటే బీపీ రాదు. అలాగే ఎలాంటి వైరస్ లు మన శరీరం పై దాడి చేయవు. శరీరంలో కొవ్వులు ఉండవు. అందుకే వెల్లుల్లి కచ్చితంగా ఆహారంలో తీసుకోండి.

అల్లం పైత్యానికి విరుగుడులా పనిచేస్తుంది. కడుపు నొప్పి, కఫం ఇలాంటివి కూడా అల్లం దూరం చేస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది.

లవంగాలు
ఘాటుగా ఉన్నా ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శ్వాసకు మేలు చేస్తాయి. దంతాలకు ఎంతో మేలు చేస్తాయి.

జీలకర్ర :
ఆకలి మందగించినా, అజీర్ణంతో ఇబ్బందులు పడుతున్నా జీలకర్ర మంచి ఔషధం. ముఖ్యంగా శ్వాస సమస్యలు ఉన్నా తగ్గుతాయి. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు.

ఆవాలు
ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి గుండెకు చాలా మంచిది.

నల్ల మిరియాలు
ఇది దగ్గు, జలుబు, కఫం ఇలాంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి. కడుపులో పుండ్లు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.

దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, సోడియం, విటమిన్ సి ఉంటాయి. ఇది శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.