పరగడుపున నెయ్యి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

0
130

పాలు మన ఆరోగ్యానికి ఎంత దోహదపడతాయో పాల నుండి తీసిన నెయ్యి కూడా ఒకటి. నెయ్యిని వేసి త‌యారు చేసిన ఆహార ప‌దార్థాల రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. నెయ్యిని తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతార‌నే కార‌ణం వ‌ల్ల‌ చాలా మంది దీనిని తిన‌రు. కానీ ఇది అంతా అపోహ మాత్ర‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. మరి నెయ్యి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ప్ర‌తిరోజూ ప‌ర‌గ‌డుపున 5 నుండి 10 ఎంఎల్ మోతాదులో నెయ్యిని తీసుకోవ‌డం వల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగును చిల‌క‌గా వ‌చ్చిన వెన్న‌తో నెయ్యిని త‌యారు చేస్తారు. నెయ్యి ఎంతో బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారం. 2 టీ స్పూన్ల నెయ్యిలో దాదాపు 300 క్యాలరీల శ‌క్తి ఉంటుంది. త‌గిన మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు నాడీ వ్య‌వ‌స్థ మెరుగుప‌డి మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది.

రాత్రి ప‌డుకునే ముందు పాల‌లో కొద్ది మోతాదులో నెయ్యిని క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య తగ్గుతుంది. త‌ర‌చూ ఆవు నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. క్యాన్స‌ర్ కణాల‌ను నిరోధించే శ‌క్తి కూడా నెయ్యికి ఉంద‌ని ఇటీవ‌లి ప‌రిశోధ‌న‌లు తెలియ‌జేస్తున్నాయి.

రోజూ నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెర‌గ‌డంతోపాటు వీర్య‌క‌ణాల సంఖ్య కూడా పెరుగుతుంది. నెయ్యిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. క‌నుక దీనిని త‌గిన మోతాదులో తీసుకుని ఆరోగ్యక‌ర‌మైన‌ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.