‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ అప్పుడే..క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజ్

0
36

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జి5 బింబిసారాను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ పై దిల్‌ రాజ్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బింబిసార సినిమాను 50 రోజుల తర్వాతనే ఓటీటీలో రిలీజ్‌ చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు థియేటర్లలోనే ఉంటుందని చెప్పారు.