జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

0
102

జామకాయ. మనకు ప్రస్తుతం చౌకగా..సంవత్సర కాలంలో ఎక్కువ రోజులు లభించే పండ్లు. వీటిని ప్రతిరోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జామకాయలో మన శరీరానికి కావలసిన పోషకాలు అన్ని సమృద్ధిగా ఉంటాయి.

జామకాయలు తినడం వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వీటిని త‌రుచూ తిన‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో ఉండే నొప్పుల‌ను, అలాగే గాయాల‌ను త‌గ్గించ‌డంలో కూడా జామ‌కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల్లో సంతాన లేమి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. నెల‌స‌రి స‌మ‌యంలో స్త్రీలు వీటిని తిన‌డం వ‌ల్ల ఆ స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

జామకాయ‌ల్లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక జామ‌కాయ‌ల‌ను త‌ప్ప‌కుండా మ‌నం త‌ర‌చూ తీసుకుంటూ ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు.