సమ్మర్ లో పుచ్చకాయతో ఎన్ని లాభాలో తెలుసా?

0
43

రోజు‌రోజుకు ఎండలు ముదురుతున్నాయి. మొన్నటి వరకు చలి తీవ్రత తట్టుకోలేకపోయిన ప్రజలు ఇప్పుడు ఎండలకు మండిపోతున్నారు. ఎండలు భగ భగ మండుతుండడంతో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి జనాలు చేయని ప్రయత్నం ఉండదు. సమ్మర్ లో పుచ్చకాయతో కొంతమేర ఎండల నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఎండాకాలంలో పుచ్చకాయతో కలిగే లాభాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరం వడదెబ్బకు గురికాకుండా హైడ్రేట్ చేయడంలో పుచ్చకాయను మించిది మరోటి లేదు. ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.  పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది. దీన్ని తరుచు తీసుకోవడం వల్ల వేడివాతావారణం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మిమ్మల్ని చల్లగా ఉంచడంతోపాటు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పుచ్చ కాయలు తింటే రక్తపోటు గుండెపోటు తగ్గుతుందట.  క్యాన్సర్ వ్యాధిని తగ్గించే లక్షణం కూడా పుచ్చకాయలో  ఉంది.  ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు పుచ్చకాయ ముక్కలు తింటే బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. కిడ్నీలో రాళ్ల తో బాధపడేవారు తేనెతో కలిపి పుచ్చకాయ ముక్కలు తింటే ఎంతో ఉపశమనం కలుగుతుంది.  మలబద్ధకాన్ని కూడా పుచ్చకాయదూరం చేస్తుందట. కామెర్లు వికారం పైత్యం లాంటివి కూడా పుచ్చకాయ తినడం వల్ల దూరమవుతాయట. కాల్షియం అధికంగా వున్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు వంటి రోగాలు కూడా దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.