మీకు తెలుసా మనం తినే పండ్లలో ఎంత చక్కెర ఉంటుందో

Do you know how much sugar is in the fruits we eat ?

0
27

రోజూ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. ఈ కరోనా సమయంలో కూడా చాలా మంది పండ్లని ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే కొందరికి షుగర్ సమస్య ఉంటుంది. వారు మాత్రం కొన్ని రకాల పండ్లు తీసుకోరు.అయితే మీరు గమనించారా? అసలు పండ్లలో షుగర్ ఎంత శాతం ఉంటుంది? ఏ ఫ్రూట్స్ ఎంత షుగర్ కలిగి ఉంటాయి? సో ఇప్పుడు అదే తెలుసుకుందాం.

అవకాడో ఒక అవకాడో పండులో కేవలం 1 గ్రాము చక్కెరే ఉంటుంది.

ద్రాక్ష 100 మిల్లీలీటర్ల ద్రాక్ష జ్యూస్లో 14.2 గ్రాముల చక్కెర ఉంటుంది.

చెర్రీ ఒక కప్పు చెర్రీస్లో 19 గ్రాముల చక్కెర ఉంటుంది.

అరటి ఒక అరటి పండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది.

ఒక జామకాయలో 5 గ్రాముల చక్కెర ఉంటుంది.

ఒక చిన్న మామిడిపండులో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. పెద్దది అయితే 36 గ్రాములు ఉంటుంది.

100 మిల్లీలీటర్ల యాపిల్ జ్యూస్లో 9.6 గ్రాముల చక్కెర ఉంటుంది.

ఆరెంజ్100 మిల్లీలీటర్ల ఆరెంజ్ జ్యూస్లో 8.4 గ్రాముల చక్కెర ఉంటుంది

స్ట్రాబెర్రీ ఒక గుప్పెడు స్ట్రాబెర్రీలలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.

దానిమ్మ 100 మిల్లీలీటర్ల దానిమ్మ రసంలో 12.65 గ్రాముల చక్కెర ఉంటుంది.