తల వెంట్రుకల జీవితకాలం ఎన్ని రోజులో తెలుసా?

Do you know in how many days is the lifespan of scalp hair?

0
71

జుట్టు రాలటం చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య. అయితే తలవెంట్రుకలకు జీవితకాలం ఉంటుందని మీకు తెలుసా? అందులో భాగంగానే మన వెంట్రుకులు ఊడిపోయి..మళ్లీ కొత్త వెంట్రుకలు వస్తుంటాయి. ఇంతకీ తల వెంట్రుకల జీవితకాలం ఎంతో మీకు తెలుసా?

మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి, తదితర కారణాలతో ఎంతోమంది జుట్టు రాలటం ప్రధాన సమస్యగా మారిపోయింది. హెయిర్ ఫాల్ ఈ ఒక్క‌మాట చాలు..టీనేజ్ ని క‌ట్టి ప‌డేయ‌డానికి. టీనేజ్ పిల్లల్లో హెయిర్ ఫాల్ అనే మాట త‌ర‌చూ వినిపిస్తోంది. రకరకాల కారణాలతో జుట్టు రాలినా..మళ్లీ కొత్త జుట్టు రాక తెగ ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది జుట్టు రాకపోతే నామూషిగా ఫీల్ అవుతూ నలుగురిలో వుండలేకపోతుంటారు. ప్రతిసారి వారికి వారిలోని లోపం గుర్తుకువస్తూ నరకం అనుభవిస్తుంటారు.

అయితే తల వెంట్రుకల జీవిత కాలం 3-7 సంవత్సరాలట. అలా కాలవ్యవధి పూర్తయ్యాక వెంట్రుక రాలిపోతుంటుంటదని, అక్కడ మరో వెంట్రుక పుట్టుకొస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కానీ చాలా మందికి జుట్టు రాలిపోయి తిరిగి రావటం లేదని రకరకాల అధ్యయనాలు తేల్చాయి.