తోటకూర తింటే ఎన్ని లాభాలో తెలుసా?

0
43

ప్రస్తుతం మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకు పరుగుల జీవితంతో తినడానికే సమయం దొరకడం లేదు. దానికి తోడు తినే ఆహార పదార్ధాలు కల్తీ అయిపోయాయి. దీనితో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు అవసరం.

పండ్లు, కూరగాయల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఆకు కూరల్లో తోటకూర వల్ల బోలెడు లాభాలు..

తోటకూరను తరచుగా తినడం వల్ల రక్తంలో కొవ్వుశాతం తగ్గుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. హాని కలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఈ కూడా తోటకూరలో పుష్కలంగా దొరకడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది.

హైపర్ టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మంచి మేలు చేస్తుంది.

వేపుడు కన్నా కూర అయితే ఉత్తమం.

కూరలో అధిక పోటీన్లూ శరీరానికి అందుతాయి.

బరువు తగ్గాలనుకునేవాళ్లు ప్రతి రోజూ తోటకూర తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఇందులోని పీచు పద్దారం శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు అన్నీ తోటకూరలో పుష్కలంగా లభిస్తాయి.

రక్తనాళాన్ని చురుగ్గా ఉంచుతాయి. గుండెకు మేలు చేసే పొటాషియం, సోడియం, వంటివీ అధికంగా సమకూరుతాయి.

విటమిన్ ఎ, సి, డి, ఇ, కె మరియు బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో ఇన్ని లాభాలు చాలా అరుదుగా ఉంటాయి.