వామునీరు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలో తెలుసా ?

Do you know the health benefits of drinking ajwain water

0
120

 

పోపుల పెట్టెలో ఉండే అనేక మసాలా దినుసులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ మనం వాటిని వదిలేసి మందులనే వాడుతూ ఉంటాం. కానీ వంటింట్లో ఉండే మసాలా దినుసుల వల్ల, చాలా రకాల జబ్బులు నయం అవుతాయి. ఇక వాము వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మనకు కఫం ఉన్నా, దగ్గు వస్తున్నా, కడుపు నొప్పి ఉన్నా, మన పెద్దలు వాము అన్నం తినమంటారు.అలాగే వాము నీరు తాగమంటారు. దీని వల్ల ఏ అనారోగ్య సమస్యలు ఉండవని పెద్దలు చెబుతారు.కొద్దిగా వాముని వేడినీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

ఇక రాజస్ధాన్ లో వాము ఎక్కువగా పండుతుంది. ఆసియా ఖండం అంతా ఇక్కడ నుంచే ఎక్కువ ఎగుమతి అవుతుంది. ఇక వాము నీటి ద్వారా చాలా సమస్యలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.మరి ఈ వాము నీరు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. రెండు టీస్పూన్ల వాముని దోరగా వేయించి, దాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. దానిని ఉదయం ఉడికించి వడగట్టండి, ఆ తర్వాత చల్లారాక ఆనీరు తాగాలి. దీని వల్ల ఊబకాయం సమస్య తగ్గుతుంది. శరీరంలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ సొల్యుషన్. కడుపులో గ్యాస్ సమస్య ,మలబద్ధకం, ఎలాంటి కడుపునొప్పి సమస్య అయినా నిమిషాల్లో తగ్గుతుంది.