మన ప్రపంచంలో అతి పెద్ద హిందూదేవాలయం ఏమిటి అంటే అంగ్ కోర్ వాట్ అని చెబుతారు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఉన్న అన్నీ ఆలయాల్లో ఇదే అతి పెద్ద ఆలయం.
దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అంతేకాదు 65 మీటర్ల ఎత్తులో భారీ శిఖరం ఉంటుంది.
అద్భుతమైన శిల్పకళ, పచ్చదనం పుష్కలమైన నీటితో ఉంటుంది.
కాంబోడియాలో ఈ ఆలయం ఉంది. క్రీస్తుశకం వెయ్యి శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యం. అక్కడ ఈ సామ్రాజ్యానికి అంగ్ కోర్ రాజధానిగా ఉండేది. ఇక్కడ కొంతకాలం హిందూ రాజుల పరిపాలన సాగింది.
అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు.
ఇక్కడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. 1113 సంవత్సరం నుంచి 1150 కాలంలో ఈ ఆలయం నిర్మించారు అని చెబుతారు.ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల గోపురం ఉంటుంది. ఆలయం చుట్టు నీటితో కందకం ఉంటుంది. రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుంది.