బంగాళాదుంప అధికంగా తింటున్నారా ఇది తెలుసుకోండి

Find out if you eat too much potato

0
35

బంగాళాదుంప వీటిని చాలా ఇష్టంగా తింటారు పిల్ల‌లు పెద్ద‌లు. ముఖ్యంగా చ‌పాతి పూరీకి ఈ క‌ర్రీ ఎక్కువ‌గా చేస్తారు. ఇక హోట‌ల్స్ లో కూడా ఆలూ వంట‌కాలు చాలా ఉంటాయి . ఇక చిప్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌ది రూపాయ‌ల నుంచి 1000 రూపాయ‌ల వ‌ర‌కూ ర‌క‌ర‌కాల ప్లేవ‌ర్స్ లో ఈ ఆలూ చిప్స్ దొరుకుతాయి. అయితే ఆలూ ఎక్కువ‌గా తింటే స‌మ‌స్య‌లు అంటున్నారు వైద్యులు.

ఎందుకంటే బంగాళాదుంప వలన డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటాయి. శరీరంలోని రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అందుకే షుగ‌ర్ పేషెంట్ల‌ని ఈ దుంప‌లు అతిగా తీసుకోవ‌ద్దు అంటారు.

ఇక బంగాళాదుంప‌లు తింటే మ‌ళ్లీ ఆక‌లి వేస్తుంది మ‌ళ్లీ ఫుడ్ తీసుకుంటాము దీంతో ఊబ‌కాయం అలాగే షుగ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది.ఫ్రెంచ్ ఫ్రైస్ – ఆలూ చిప్స్ అనేది అతిగా తీసుకోవ‌ద్దు ఆయిల్ వల్ల గొంతు స‌మ‌స్య‌లు జీర్ణ స‌మ‌స్య‌లు కూడా అధికం అవుతాయి. ఏదో టేస్ట్ కోసం వారానికి లేదా ప‌ది రోజుల‌కి ఓసారి తీసుకోవాలి కాని నిత్యం ఆలూ వంట‌కాలు తింటే ఆరోగ్యానికి చేటు అంటున్నారు వైద్యులు.