ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఫోన్లకు అలవాటు పడి విరివిగా ఉపయోగిస్తున్నారు. రోజంతా ఆఫీసుల్లో పని చేసుకుంటూ ఫోన్‌ను విపరీతంగా వాడి చాలా మంది ఎక్కువగా రాత్రిళ్లు పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి నిద్రపోతారు. కానీ రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోవడం వల్ల బ్యాటరీ దెబ్బతింటుందని, ఫోన్ లైఫ్ స్పాన్ తగ్గుతుందని చాలామంది సందేహపడుతుంటారు. అయితే ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎక్కువ వాడకంలో ఉన్నవి లిథియం-అయాన్ బ్యాటరీలు. ఇవి ఫోన్ ఫుల్ ఛార్జ్ అవ్వగానే కరెంట్ తీసుకోకుండా రిస్ట్రెక్ట్ చేసే పరికరాలను ఇన్‌బిల్ట్‌గా కలిగి ఉంటున్నాయి. కావున ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచితే ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
100 పర్సెంట్ ఛార్జింగ్ అయినా తర్వాత ఫోన్ ఛార్జ్‌ను తీసుకోదని వెల్లడించారు. బ్యాటరీ, ఛార్జర్పైనా ఎటువంటి ప్రభావం కూడా ఉండదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఓవర్ ఛార్జ్ అయ్యి మంటలు చెలరేగే అవకాశం కూడా లేదని తెలిపారు. ఫోన్ చార్జర్ లో, లేదా ఇంట్లో ఏదైనా పవర్ ప్రాబ్లెమ్ ఉన్నప్పుడు మాత్రమే పేలతాయని వెల్లడించారు.