భోజ‌నం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

0
110

మనలో చాలామందికి తెలియక భోజనం చేసేటప్పుడు అనేక తప్పులు చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పూర్వికులు భోజనం చేసే క్రమంలో కొన్ని పద్ధతులు పాటించేవారు. అవేంటో మనం కూడా తెలుసుకొని వాటిని అనుసరించి నడుచుకోవడం మంచిది.

భోజ‌నం త‌యారు చేసే వారు క‌చ్చితంగా స్నానం చేసే భోజ‌నాన్ని త‌యారు చేయాలి. అంతేకాకుండా దంతాల‌ను శుభ్రం చేసుకోకుండా, కాళ్ల‌కు చెప్పుల‌ను ధ‌రించి వంట చేస్తే ఇంట్లో మంచి జరగదని పెద్దలు చెబుతున్నారు. ఇంకా భోజ‌నాన్ని తిన్న త‌రువాత, తిన‌డానికి ముందు కాళ్లు, చేతుల‌ను శుభ్రంగా కడుక్కొని తూర్పు లేదా ఉత్త‌రం వైపు కూర్చొని భోజ‌నం చేయడం మంచిది.

అంతేకాకుండా భోజ‌నం చేసిన త‌రువాత తెలియక వెంట్రుక‌ల‌ను కత్తిరించుకుంటారు. కానీ అలా చేయడం వల్ల చాలా నష్టాలు కూడా చేకూరే అవకాశం ఉంది. చాలా మంది మంచం మీద కూర్చొని భోజ‌నం చేస్తూ ఉంటారు. ఇలా తిన‌డం వ‌ల్ల మ‌నం ఎంత తిన్న వంటికి పట్టదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా  అనారోగ్య స‌మ‌స్య‌లు, కుటుంబ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని పండితులు చెబుతున్నారు.